మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల చెల్లదని దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని రాఘవేందర్ రాజు అనే వ్యక్తి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు వివరాలు సమర్పించారని పిటిషనర్ రాఘవేందర్ రాజు ఆరోపించారు.
Aslo Read :- ఈడీ ముందు హీరో నవదీప్
ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధమని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న కోర్టు లేటెస్ట్ గా పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.