హైదరాబాద్, వెలుగు : భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో తనపై ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. మన్నెగూడ వద్ద రెండెకరా ల ల్యాండ్‌ను కన్నారావు మరో 30 మంది కలిసి కబ్జాకు యత్నించా రంటూ ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కన్నారావు పిటిషన్ వేశారు. దీన్ని జడ్జి జస్టిస్ కె.సుజన విచారించారు. రాజకీయ కక్షలతో చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్న పిటిషనర్ వాదనను కోర్టు తిరస్కరించింది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగిం చాలని పోలీసులను ఆదేశించింది.