కేటీఆర్​ ఎంక్వైరీ రూమ్​లోకి లాయర్​ వెళ్లొద్దు..దూరంగా ఉండి చూడొచ్చు

కేటీఆర్​ ఎంక్వైరీ రూమ్​లోకి లాయర్​ వెళ్లొద్దు..దూరంగా ఉండి చూడొచ్చు
  • కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్​పై హైకోర్టు ఆదేశాలు
  • ఏసీబీ విచారణనుఆడియో, వీడియో రికార్డింగ్ చెయ్యాలన్న విజ్ఞప్తికి నో   
  • తదుపరి విచారణ20కి వాయిదా

హైదరాబాద్, వెలుగు : ఫార్ములా–ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెంట ఆయన లాయర్ వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఎంక్వైరీ రూమ్​లోకి కేటీఆర్ ఒక్కరే వెళ్లాలని, ఆయన లాయర్ వెళ్లేందుకు వీల్లేదని ఆదేశించింది. ‘‘కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ విచారించేటప్పుడు పక్కన ఆయన లాయర్ ఉండేందుకు వీల్లేదు. విచారణను న్యాయవాది దూరం నుంచి చూడవచ్చు. విచారణలో జోక్యం చేసుకోవడం గానీ, ఎంక్వైరీ రూమ్​లోకి వెళ్లడం గానీ చేయొద్దు” అని ఆదేశాలు జారీ చేసింది.

ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో తన వెంట లాయర్​ను కూడా అనుమతించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి.. కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్లేందుకు పై షరతులతో అనుమతి ఇచ్చారు.  ముగ్గురు లాయర్ల పేర్లు ఇస్తే, వారిలో ఒకరిని అనుమతించేందుకు ఉత్తర్వులు ఇస్తామని జడ్జి చెప్పగా.. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంట సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె.రామచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు వెళ్తారని పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

అనంతరం జడ్జి స్పందిస్తూ.. ‘‘కేటీఆర్‌‌‌‌ వెంట న్యాయవాదిని అనుమతించాలి. కేటీఆర్‌‌‌‌ను దర్యాప్తు అధికారి విచారించేటప్పుడు వాళ్లిద్దరూ న్యాయవాదికి కనిపించేలా ఏర్పాట్లు చేయాలి” అని ఏసీబీని ఆదేశించారు. కాగా, ఏసీబీ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్‌‌‌‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌ న్యాయవాది ప్రభాకర్‌‌‌‌రావు కోరారు. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ అవినాశ్​​ రెడ్డి కేసులో ఆడియో, వీడియో రికార్డింగ్​కు ఇదే హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. దీనిపై జడ్జి స్పందిస్తూ.. ‘‘ఆ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌‌‌‌గా ఐపీఎస్‌‌‌‌ అధికారి ఉన్నారు.

అవినాశ్​ రెడ్డి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లోని అంశాలను డిలీట్‌‌‌‌ చేయడం లేదా చెప్పని విషయాలను యాడ్‌‌‌‌ చేయడం జరుగుతున్నదన్న తీవ్ర ఆరోపణల కారణంగా ఆ తరహా ఉత్తర్వులు నేనే ఇచ్చాను. గురువారం ఏసీబీ విచారణకు పిటిషనర్‌‌‌‌ (కేటీఆర్) హాజరైన తర్వాత పరిస్థితులు ఆశించిన విధంగా లేవని భావిస్తే.. ఆయన మళ్లీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించవచ్చు” అని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. 

లాయర్ వస్తే నష్టమేంటి? 

ఈ పిటిషన్​పై జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ బుధవారం మధ్యాహ్నం 2:15 గంటల టైమ్​లో విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ (కేటీఆర్)ను దర్యాప్తు అధికారి విచారణ చేస్తున్నప్పుడు ఆయన తరఫు లాయర్ చూసేందుకు వీలుగా ఏసీబీ ఆఫీసులో ఏర్పాట్లు ఉన్నాయో? లేవో? తెలుసుకుని చెప్పాలని అదనపు అడ్వొకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ రజనీకాంత్‌‌‌‌ రెడ్డిని మొదట ఆదేశించారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరోసారి విచారణ చేపట్టగా.. కేటీఆర్‌‌‌‌ వెంట న్యాయవాదిని అనుమతించవద్దని రజనీకాంత్‌‌‌‌ రెడ్డి కోరారు. అయితే, ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

‘‘దర్యాప్తు అధికారి, కేటీఆర్‌‌‌‌ ఒక రూమ్​లో ఉంటే.. మరో రూమ్​లో న్యాయవాది ఉంటారు. ఎంక్వైరీ రూమ్​లోకి న్యాయవాది వెళ్లనప్పుడు మీకొచ్చిన అభ్యంతరం ఏంటి? వైసీపీ ఎంపీ అవినాశ్​ రెడ్డిని విచారించిన టైమ్​లో న్యాయవాదిని అనుమతించాం. దర్యాప్తులో న్యాయవాది జోక్యం చేసుకునేందుకు వీల్లేనప్పుడు పిటిషనర్‌‌‌‌ వెంట న్యాయ వాది వెళ్తే నష్టమేంటి?” అని ప్రశ్నించింది. 

ఏదో ఒక్కటే రిలీఫ్ ఇస్తం.. 

కేటీఆర్‌‌‌‌ను ఏసీబీ విచారించేటప్పుడు ఆడియో, వీడి యో రికార్డింగ్ చేయాలని కోర్టును పిటిషనర్ తరఫు లాయర్ ప్రభాకర్‌‌‌‌ రావు కోరారు. అయితే, అందుకు కోర్టు నిరాకరించింది. ‘‘న్యాయవాది సమక్షంలో ఏసీబీ విచారణ కావాలా? లేక కేటీఆర్​ను విచారించేటప్పుడు ఆడియో, వీడియో రికార్డింగ్‌‌‌‌ కావాలా? ఏదో ఒక్కటే రిలీఫ్‌‌‌‌ ఇవ్వగలం” అని తేల్చి చెప్పింది.

అయితే అవినాశ్​ రెడ్డి కేసులో ఆ రెండూ ఇచ్చారని న్యాయవాది గుర్తు చేశారు. ‘‘అవినాశ్​ రెడ్డి కేసు దర్యాప్తు చేసింది ఐపీఎస్‌‌‌‌ అధికారి. అవినాశ్​ రెడ్డి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ను డిలీట్‌‌‌‌ చేయడం, లేని విషయాలను చేర్చడం వంటివి జరిగాయనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆ విధంగా ఆర్డర్‌‌‌‌ ఇవ్వాల్సి వచ్చింది” అని తెలిపింది.