హైదరాబాద్ లోని చెరువులు, నాళాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. హైడ్రా కూల్చివేతలు గల రెండుమూడు నెలలుగా చర్చనీయాంశ అయ్యాయి. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపాలని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్ నేడు (అక్టోబర్ 4)న విచారణ జరిగింది. ఇప్పటికిప్పుడు హైడ్రా కూల్చివేతలు ఆపలేమన్న హైకోర్టు తేల్చి చెప్పింది.
ALSO READ | పీసీసీ చీఫ్ కు అంజన్‌కుమార్ యాదవ్ సన్మానం
కోర్టు ప్రతివాదులు అయిన హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 14 కి వాయిదా వేసింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా KA పాల్ వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజులు ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు. GO నెంబర్ 99 పై స్టే విధించాలని KA పాల్ కోరారు.