నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీకి హైకోర్టు సూచన

హైదరాబాద్, వెలుగు: వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మానవత్వంతో స్పందించి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించింది. వారంలోగా వీధి కుక్కల నియంత్రణకు సలహాలు ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీకి ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని చెప్పింది. వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదని, వాటికి వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం లేదని, సరైన ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. 

దీనికి తోడు ఈ ఏడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందాడు. దీన్ని హైకోర్టు పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్వీకరించింది. ఈ రెండింటిపైన చీఫ్​ జస్టిస్​ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె.అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బెంచ్​ బుధవారం విచారణ చేపట్టింది. సంపన్నులుంటున్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలపైనే కాకుండా పేదలు ఉంటున్న మురికివాడలు, శివారు కాలనీలపై దృష్టిసారించాలని సూచించింది.

 జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కొత్త నిబంధనలు రూపొందించామని, కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారన్న అంశాన్ని మానవత్వంతో పరిశీలించాలంది. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోకపోతే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. కమిటీ ఏర్పాటుతో ఏం చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై  నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.