కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చు:హైకోర్టు

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చు:హైకోర్టు

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు  స్పష్టం చేసింది. ఇప్పటికే ముగ్గురికి  పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులు పై స్టేకు హై కోర్టు నిరాకరించింది. ముగ్గురు  కాంగ్రెస్ వార్ రూమ్ ఉద్యోగులను సోమవారం పోలీసుల ముందు హజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. వీరిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు తెలిపింది. 

కాంగ్రెస్‌‌‌‌‌‌వార్‌రూంలో పనిచేస్తున్న హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌ సిమ్లాకు చెందిన ఇషాన్‌శర్మ, విశాఖ వాసి తాతినేని శశాంక్, విజయవాడకు చెందిన ఎం. శ్రీప్రతాప్‌‌‌లపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసి, 41ఏ నోటీసులు జారీ చేశారు. పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేయడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల తరఫున సీనియర్‌‌న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. 

వార్‌‌‌రూంలోని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారని, పం చనామా చేసినట్లు డాక్యుమెంట్‌కూడా ఇవ్వలేదన్నా రు. ఎఫ్‌ఐఆర్‌‌లోని ఆరోపణలు ఏవీ పిటిషనర్లకు వ ర్తించవన్నారు. 41ఏ నోటీసులో కారణాలు ఏమీ లేవన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తరహాలోనే కారణాలు లేకుండా 41ఏ నోటీసు ఇచ్చారని తెలి పారు. మాయాబజార్‌లోని సన్నివేశం తరహాలో సోషల్‌‌మీడియా పోస్టు పెట్టడం పరువు నష్టం ఏమీకాదన్నారు. పోలీసులు సోదా చేసిన తర్వాత పిటిషనర్లను18 గంటలపాటు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, హెబియస్‌కార్పస్‌‌‌‌పిటిషన్‌దాఖలు చేశాకే వాళ్లను అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారని తెలిపారు. పిటిషనర్లకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని కోరారు.