హైదరాబాద్ : తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు వివరాలు ఇచ్చారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిటిషన్ వేశారు. పిటిషనర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేసింది న్యాయస్థానం. ఆగస్టు 12 నుండి 17వ తేదీ వరకు క్రాస్ ఎగ్జామినేషన్ ను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్ట్ 21కి వాయిదా వేసింది న్యాయస్థానం.