తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు విచారణ జరుగుతుంది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును A4గా చేర్చారు. ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాధాకిషన్ రావు వేసిన బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 23కి వాయిదా వేసింది.