మూసీపై నిజాం పాలనలోనే కీలక చట్టం

మూసీపై నిజాం పాలనలోనే  కీలక చట్టం

మూసీ రివర్​ బెడ్,  బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్​, ఎఫ్​టీఎల్​లో చట్టవిరుద్దంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాల్సిందేనని, అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. 

నిజాం పాలనలో చట్టం

1908లో మూసీ వరదలు ముంచెత్తడంతో నాటి నిజాం పాలకులు జంట జలాశయాలను నిర్మించారని హైకోర్టు గుర్తుచేసింది. అప్పుడే ల్యాండ్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ యాక్ట్‌‌‌‌‌‌‌‌–1317ను తెచ్చారని తెలిపింది. ‘‘రోడ్లు, బ్రిడ్జీలు, గుంతలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలపై సర్వహక్కులు ప్రభుత్వానివే. కొందరు చెరువులు, ట్యాంకులు, రివర్‌‌‌‌‌‌‌‌ బెడ్​లను ప్లాట్లుగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారు.  చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో 2002లో వాల్టా చట్టాన్ని నాటి ప్రభుత్వం తెచ్చింది. ఈ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో వాచ్‌‌‌‌‌‌‌‌ కమిటీల ఏర్పాటుకు జీవో  386 తెచ్చింది” అని వివరించింది.

గైడ్​లైన్స్​ కింది కోర్టులు ఫాలో కావాలి

మూసీ నదిలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కింది కోర్టులు ఇంజక్షన్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసేముందు 2023లో తాము జారీ చేసిన గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని హైకోర్టు తెలిపింది. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వర్సెస్‌‌‌‌‌‌‌‌ ఫిలోమెనా ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. అక్రమణ నిర్మాణాల తొలగింపుపై స్టే, తాత్కాలిక ఇంజంక్షన్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేసే ముందు హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ను కూడా కింది కోర్టులు ఫాలో కావాలని స్పష్టం చేసింది.  

ALSO READ : లారీల్లో తెచ్చి, పైపులైన్లు వేసి.. మూసీలోకి కెమికల్స్​ డంపింగ్​

సర్వేకు అధికారులు వస్తే అడ్డుకోవద్దు

ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌‌‌‌‌జోన్లను గుర్తించేదుకు సర్వే అధికారులు, సిబ్బంది వస్తే వాళ్లను పిటిషనర్లు, ప్రజలు అడ్డుకోరాదని హైకోర్టు ఆదేశించింది. సర్వేకు ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు కల్పించకూడదని, సహకరించాలని తెలిపింది. ‘‘హైకోర్టు ఉత్తర్వుల అమలు కోసం నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ శాఖలకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి. మూసీలోకి మురికినీరు రాకుండా చర్యలు తీసుకోవాలి. మూసీ బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్, ఎఫ్​టీఎల్, రివర్​ బెడ్‌‌‌‌‌‌‌‌ లోని ఆక్రమణదారుల అక్రమ నిర్మాణాలను తొలగించే సమయంలో  సుప్రీంకోర్టు గైడ్​లైన్స్​ను కచ్చితంగా అమలు చేయాలి” అని ఆదేశించింది. మూసీ పునరుజ్జీవం వల్ల ప్రభావితమయ్యే  వ్యక్తులకు సంబంధించి ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించాలని, ప్రభావితమయ్యే పేదలకు వివిధ ప్రభుత్వ పథకాల కింద అనువైన ప్రాంతంలో వసతి కల్పించాలని తెలిపింది. 2012 బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ విధిగా అమలు చేయాలని..  చట్ట వ్యతిరేకంగా మూసీ నదిలో నిర్మాణాలు ఉన్నట్లయితే నిబంధనలకు తగ్గట్టు తొలగించాలని హైకోర్టు గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్​లో పేర్కొంది.