పరిహారం ఇస్తమని హామీ ఇచ్చి.. కొత్త కథ చెప్తరా?

పరిహారం ఇస్తమని హామీ ఇచ్చి.. కొత్త కథ చెప్తరా?

హైదరాబాద్, వెలుగు: రోడ్డు నిర్మాణం కోసం భూమి తీసుకొని బాధితుడికి పరిహారం చెల్లించకపోవడంతో అధికారులపై హైకోర్టు మండిపడింది. పరిహారం ఇస్తామని కోర్టులో హామీ ఇచ్చి, మళ్లీ ఇప్పుడు ఎందుకు కొత్త కథ చెబుతున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని చెప్పింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్డు నిర్మాణం కోసం మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాజం అలీకి చెందిన 267 గజాల ఇంటి స్థలాన్ని జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ సేకరించింది. దీనిపై బాధితుడు కోర్టుకు వెళ్లగా, పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పరిహారం ఇవ్వకపోవడంతో అలీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిని చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభినంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షావిలీల బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారించింది. ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.1.64 కోట్లు పరిహారంగా నిర్ణయించారని, ఇతర ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓనర్ల పరిహారంతో కలిపి 4.93 కోట్లు అథారిటీలో జమ చేశారని పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ పోరంబోకు స్థలంలో ఉన్నందున పరిహారం ఇవ్వలేదని ప్రభుత్వ లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాధీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదించారు. ధిక్కరణ పిటిషన్ దాఖలైనంక కొత్త విషయం ఎం దుకు చెప్తున్నారని బెంచ్ ప్రశ్నించింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30న విచారణకు మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, అప్పట్లో జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న దానకిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.