తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో TS EAPCET( గతంలో ఎంసెట్), TS ICET పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి మార్చింది. మే 7, 8న జరగాల్సిన అగ్రికల్చర్ స్ట్రీమ్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను మే 9, 11 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే జూన్ 4న నిర్వహించాల్సిన TS ICET పరీక్షలను జూన్ 5, 6 తేదీలకు ఉన్నత విద్యామండలి మార్పు చేసింది.