సభను సక్సెస్ ​చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పిలుపు

హుజూర్ నగర్, వెలుగు : ఈనెల 21న హుజూర్ నగర్ లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ లోని రాజీవ్ ప్రాంగణంలో నిర్వహించే ఎం‌పీ ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

రాష్ట్రంలోనే నల్గొండ ఎం‌పీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారని జోస్యం చెప్పారు. ఈ సభకు నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట నాయకులు తన్నీరు మల్లికార్జునరావు, దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, సుంకరి శివరాం, మజీదు పాల్గొన్నారు.