ప్రపంచ క్రికెట్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి మరో లీగ్ సిద్ధమైంది. మంగళవారం (జూలై 23) నుంచి హండ్రెడ్ లీగ్ నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. మెన్స్, ఉమెన్స్ ఒకేసారి ఈ లీగ్ ఆడనున్నారు. టోర్నమెంట్ మహిళల మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పురుషుల మ్యాచ్ జరుగుతుంది. మెన్స్ టోర్నీలో తొలి మ్యాచ్ లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌తో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తలబడుతుంది. లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది.
మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. వెల్ష్ ఫైర్, సదరన్ బ్రేవ్, ట్రెంట్ రాకెట్స్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్, లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్,ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఈ టోర్నీ టైటిల్ కోసం పోరాడతాయి. ఇంగ్లాండ్ వేదికగా జూలై 23 నుంచి ఆగస్టు 18 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతుంది. 2023 సీజన్ లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై 14 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.
Also Read:-క్రికెట్‌కు ఆరు నెలలు దూరం.. ప్రమాదంలో బట్లర్ కెప్టెన్సీ
లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
హండ్రెడ్ లీగ్ మెన్స్, ఉమెన్స్ మ్యాచ్ లన్నీ టెలివిజన్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో ఈ మ్యాచ్ సోనీ లివ్, ఫ్యాన్‌కోడ్‌లో లైవ్ చూడొచ్చు.
హండ్రెడ్ లీగ్ టోర్నీ వేదికలు:
ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
లార్డ్స్, లండన్
ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
హెడింగ్లీ, లీడ్స్
ది ఓవల్, లండన్
రోజ్ బౌల్, సౌతాంప్టన్
ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్
సోఫియా గార్డెన్స్, కార్డిఫ్