ములుగు, వెలుగు: 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో పేదల ఆకలి కేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయని మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ములుగులోని గట్టమ్మ దేవాలయం నుంచి 75 కిలోమీటర్ల పాదయాత్రను సీతక్క ప్రారంభించారు. సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ స్వాతంత్ర్యం కోసం పోరాడిందని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జాతీయ జెండాను ఎగరవేయడానికి నిరాకరించిన బీజేపీ.. ఇప్పుడు వాట్సప్ డీపీలు పెట్టుకోమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి, కార్యదర్శి అశోక్, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ రాంరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు రవిచందర్, లీడర్లు పాల్గొన్నారు.
కాజీపేట, వెలుగు: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆజాదీ గౌరవ్‌యాత్రను చేపట్టారు. మంగళవారం కాంగ్రెస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి 75 కిలోమీటర్ల పాదయాత్రను కాజీపేట ఫాతిమా చౌరస్తా నుంచి ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్లు వెంకట్రామ్ రెడ్డి, శ్రీనివాస్, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్(జఫర్‌గఢ్), వెలుగు: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట గ్రామంలో డీసీసీ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు.