బోధన్,వెలుగు: బోధన్ జిల్లా ఏర్పాటు కోసం చేపట్టిన నిరాహారదీక్ష లు శనివారం నాటికి 146వ రోజుకు చేరాయి. శనివారం దీక్షలో బోధన్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎం. గంగారెడ్డి, నాయక్ సాయిలు కూర్చున్నారు. దీక్షలను సీనియర్ న్యాయవాది సీహెచ్. వి.హన్మంతరావు, పూలమాలలు వేసి ప్రారంభించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ బోధన్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో బోధన్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు బాణోత్ రమేష్, అడ్లూరి శ్రీనివాస్,అజయ్, అనిల్ కుమార్, గుమస్తా ఖైసర్ తదితరులు పాల్గొన్నారు.