భార్యాపిల్లలను చంపి భర్త ఆత్మహత్య.. ఆర్థిక సమస్యలే కారణమని లేఖ

బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులతో మంగళూరులో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముందుగా పిల్లలకు విషమిచ్చి, తర్వాత భార్యను హత్యచేసి ఆపై భర్త ఉరేసుకున్నాడు. కర్నాటకలోని మైసూరుకు చెందిన దేవేంద్ర(48), నిర్మల(46), వారి తొమ్మిదేండ్ల కవల పిల్లలు చైత్ర, చైతన్యతో మంగళూరుకు వెళ్లి ఓ లాడ్జిలో దిగారు. 

వచ్చినప్పటి నుంచి తలుపులు మూసి ఉండడంతో లాడ్జి సిబ్బంది శుక్రవారం వారిని డోర్ తీయాలని పిలిచారు. ఎంతకీ తీయకపోవడంతో స్పేర్ కీతో డోర్ తెరిచారు. లోపల కుటుంబం మొత్తం విగతజీవులుగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాము చనిపోతున్నట్లు దేవేంద్ర రాసిన సూసైడ్​ నోట్​  ఘటనా స్థలంలో దొరికిందని పోలీసులు తెలిపారు.