- 24 వేల కోట్ల అంచనా వ్యయంతో 76 కి.మీ.నిర్మాణం
- ఒక్క కిలోమీటర్‌కు రూ. 318 కోట్లు మాత్రమే ఖర్చు
- మిగతా నగరాల్లో రూ.373 నుంచి 1492 కోట్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్‌మెట్రో రైల్ఫేజ్–2 తక్కువ ఖర్చుతోనే నిర్మాణం కానుంది. బెంగళూరు, చెన్నై, ముంబై సిటీల్లో కిలోమీటర్నిర్మాణానికి రూ. 373 కోట్ల నుంచి 1492 కోట్ల వరకూ ఖర్చవుతుండగా, హైదరాబాద్ మెట్రోసెకండ్ ఫేజ్మాత్రం కిలోమీటర్‌కు రూ.318 కోట్లు మాత్రమే ఖర్చవుతోంది. పబ్లిక్ట్రాన్స్పోర్టులో మెట్రో అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ఫేజ్ను విస్తరించాలని నిర్ణయించి, ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.
ప్రస్తుతం ఫేజ్–2లోని ఐదు కారిడార్లకు సంబంధించి డీపీఆర్‌లను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. అయితే, డీపీఆర్‌ల ఆమోదంతో సంబంధం లేకుండా ఓల్డ్‌సీటీ మెట్రోపనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే జనవరి నాటికి భూసేకరణ పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించేలా మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫస్ట్ ఫేజ్‌తో పోల్చినా.. తక్కువే
పీపీపీ విధానంలో నిర్మించిన మెట్రో ఫేజ్–1తో పోలిస్తే మెట్రో ఫేజ్– 2 నిర్మాణ ఖర్చు కూడా చాలా తక్కువ. ఫేజ్–1 లో 69 కిలోమీటర్ల దూరాన్ని 57 మెట్రో స్టేషన్లతో నిర్మించారు. దీనికి గాను రూ. 22,148 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా ఎలివేటెడ్కారిడార్నిర్మాణమే. కిలోమీటర్నిర్మాణానికి రూ.388 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఫేజ్‌లో 76.4 కిలోమీటర్ల దూరాన్ని 54 మెట్రో స్టేషన్లతో రూ. 24,267 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మించనున్నారు. కిలోమీటర్‌కు రూ. 318 కోట్లు మాత్రమే ఖర్చు కానుంది. పీపీపీ పద్ధతిలో నిర్మించిన ఫేజ్–1 ప్రాజెక్టు కోసం ఇండియన్బ్యాంకుల నుంచి పది శాతం వడ్డీకి రుణాలు తెచ్చారు.
దీంతో మెట్రోపై ఆర్థిక భారం పడింది. ఫేజ్–2 కోసం కేంద్ర ప్రభుత్వం 18 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, పీపీపీ పద్ధతి ద్వారా 4 శాతం నిధులు సేకరించన్నారు. మరో 48 శాతాన్ని ఇంటర్నేషనల్ బ్యాంకుల నుంచి 2 శాతం వడ్డీకి కేంద్ర ప్రభుత్వ సావరిన్గ్యారెంటీతో తీసుకురానున్నారు. ఫేజ్–1లో మియాపూర్, నాగోల్‌లో మెట్రో డిపోలను నిర్మించగా, ఆ డిపోలనే వినియోగించాలని మెట్రో అధికారులు యోచిస్తున్నారు. విస్తరణ నేపథ్యంలో మరో రెండు డిపోలను ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేసి, అర్థిక భారాన్ని తగ్గించుకునేలా కసరత్తు చేస్తున్నారు.
ఇతర సిటీల మెట్రోలతో పోలిస్తే తక్కువే..
ముంబై మెట్రోకు కిలోమీటర్నిర్మాణానికి రూ. 543 కోట్ల నుంచి 1492 కోట్లు ఖర్చవుతుండగా, చెన్నై మెట్రోకు కిలోమీటర్‌కు రూ. 619 నుంచి 750 కోట్లు, బెంగళూరు మెట్రోకు కిలోమీటర్‌కు రూ. 373 నుంచి రూ. 569 కోట్లు ఖర్చవుతున్నది. ఆ సిటీల్లో మెట్రో ఎక్కువగా అండర్‌గ్రౌండ్ నుంచి వెళ్లడం, భూసేకరణ ఇబ్బందులతో నిర్మాణ అంచనా వ్యయం పెరిగింది.
హైదరాబాద్ మెట్రోకు సంబంధించి శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో 1.5 కిలోమీటర్దూరం అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తోంది. మియాపూర్–పఠాన్‌చెరు కారిడార్‌లో 1.5 కిలోమీటర్దూరం డబుల్డెక్కర్నిర్మాణం చేయనున్నారు. మిగిలినదంతా ఎలివేటెడ్కారిడార్నిర్మాణం కావడంతో నిర్మాణం వ్యయం తక్కువ కానున్నది.