ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం సందడిగా కొనసాగింది. ఆదివారం వీకెండ్ కావడంతో వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు, పేరెంట్స్ తమ పిల్లలతో బుక్ ఫెయిర్ కు తరలివచ్చారు. స్టాల్స్ తిరుగుతూ నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. సక్సెస్ స్టోరీలు, పిల్లల కార్టూన్ పుస్తకాలపైన చిన్నారులు, విద్యార్థులు ఎక్కువ దృష్టి పెట్టారు. వాటి ప్రత్యేకతను తెలుసుకొని కొనుగోలుచేశారు. బుక్ ఫెయిర్ కు వచ్చిన సందర్శకులు ఒక పక్క పుస్తకాలను కొనుగోలు చేస్తూనే మరోపక్క అక్కడే వంటకాల స్టాల్స్ లో ఫుడ్ ఐటమ్స్ ను తింటూ ఆస్వాదించారు.