బ్లూ హైదరాబాద్ ..వాన నీటి సంరక్షణకు వాటర్ బోర్డ్ ప్లాన్​

బ్లూ హైదరాబాద్ ..వాన నీటి సంరక్షణకు వాటర్ బోర్డ్ ప్లాన్​

హైదరాబాద్, వెలుగు:గ్రేటర్​లో వాన నీటి సంరక్షణపై వాటర్ బోర్డ్​ఫోకస్ పెట్టింది. ఏటా డ్రైనేజీలో కలిసి వృథా అవుతున్న 82శాతం నీటిని ఒడిసి పట్టి గ్రౌండ్ వాటర్ డెవలప్ చేసేందుకు బ్లూ హైదరాబాద్ ​ప్రోగ్రామ్​తో ముందుకెళ్తోంది. జీహెచ్ఎంసీ 150 డివిజన్ల పరిధిలో వాక్ టీమ్​లతో వాటర్​ వేస్టేజ్ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇంటింటి సర్వే, వృథా అయ్యే ఏరియాలను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో వాన నీరు డ్రైనేజీలో కలవకుండా ఇంటి ఆవరణలోనే ఇంకేలా ఇంకుడు గుంతలతోపాటు ఇంజెక్షన్ పాట్స్ ఏర్పాటు చేయనుంది.

వాక్ లీడర్లతో సర్వే

బ్లూ హైదరాబాద్ కోసం సిటీని వాటర్​బోర్డు 98 బ్లాకులుగా విభజించింది. జూన్​లో వాక్ లీడర్లతో ఆయా ఏరియాల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్, నీటి వనరులు, గ్రౌండ్ వాటర్ లెవల్స్, ముంపు ప్రాంతాలను గుర్తించింది. నిలిచిన వాన నీరు భూమిలోకి ఇంకే విధంగా చర్యలు చేపట్టనుంది. స్థానికులు, అపార్టుమెంట్ కమిటీలు, గేటెడ్ కమ్యూనిటీలతో కలిసి రెయిన్ వాటర్ పీట్స్, ఇంజెక్షన్ పాట్స్ ఏర్పాటు చేయనుంది.

ఐటీ కారిడారే తొలి బేసిన్​

డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ ను తొలి బేసిన్ గా ఎంపిక చేసుకుంది. కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం ఏరియాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచనుంది. ఇందుకు గోల్కొండ చెరువు, గోపి చెరువు పరిసరాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయనున్నట్లు బ్లూ హైదరాబాద్ ప్రతినిధి కల్పన రమేష్ తెలిపారు.

15 ప్రాంతాల్లో పడిపోయినయ్​

సిటీలో ఏటా గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. గతేడాది వర్షపాతం సమృద్ధిగా ఉన్నా ఏమాత్రమూ పెరగలేదు. ఇటీవల సిటీలోని 22 ప్రాంతాల్లో సేకరించిన డేటా ఆధారంగా15 చోట్ల పడిపోయినట్లు గ్రౌండ్ వాటర్ వింగ్ అధికారులు తెలిపారు. మారేడ్​పల్లి, తిరుమలగిరి, ఎస్ఆర్​నగర్, ఎర్రగడ్డ, బండ్లగూడలో 3 మీటర్ల లోతుకు వెళ్లాయి. మారేడ్​పల్లిలో గతేడాది 23.48మీటర్ల లోతున ఉండగా, ప్రస్తుతం 20 మీటర్లకు చేరింది. ఐదు మీటర్ల లోతులో ఉన్న తిరుమలగిరిలో 17 మీటర్ల లోతుకు పడిపోయాయి.