టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలోని దేవతల గుట్టపై ఉన్న తుంబూరీశ్వర ఆలయంలో జైనమత తీర్థంకరుడు పార్శ్వనాథుడి పురాతన రాతి విగ్రహం చోరీకి గురైంది. ఏఎస్ఐ దయానంద్ కథనం ప్రకారం..
సూరంపల్లి గ్రామానికి చెందిన తాడూరి సాయిలు మేకలు మేపడానికి శుక్రవారం ఉదయం దేవతల గుట్టపైకి వెళ్లగా అక్కడ పూజా సామగ్రి, తాళ్లు, కట్టెలు, టైర్లు, ట్యూబులు కనబడడంతో అనుమానం వచ్చి గుడి దగ్గరకు వెళ్లి చూడగా రాతి విగ్రహం కనిపించలేదు. వెంటనే వేల్పుగొండ , సూరంపల్లి రెండు గ్రామాల వారికి సమాచారం అందించాడు. వేల్పుగొండ మాజీ సర్పంచ్ నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.