సెర్లాక్‌లో పురుగులు.. 14 నెలల పాపకు ఫుడ్ ఇన్ఫెక్షన్

సెర్లాక్‌లో పురుగులు.. 14 నెలల పాపకు ఫుడ్ ఇన్ఫెక్షన్

కుత్బుల్లాపూర్: చిన్న పిల్లలకు తినిపించే సెర్లాక్ లో పురుగులు ప్రత్యక్షమైన ఘటన శుక్రవారం హైదరాబాద్ లో కలవరం రేపింది. చింతల్, పద్మా నగర్ రింగ్ రోడ్ లోని అపోలో ఫార్మసీలో కొన్న సెర్లాక్ పౌడర్లో పురుగులు రావడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురైయ్యారు. గత కొన్నిరోజులుగా అదే సెర్లాక్ 14 నెలల పాపకు పెడుతున్నామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వెంకటేష్ అనే వ్యక్తి తన కూతురు (14నెలల)  పాపకు ఏడాది నుండి తల్లి పాలు లేకపోవడంతో (EASUM,NUTRICIA) అనే సెర్లాక్ పౌడర్ ను తినిపిస్తున్నామని చెప్పారు. కొద్ది రోజులుగా పాప ఆరోగ్యం సరిగా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లిన ప్రతి సారి వైద్యులు FOOD ఇన్ఫెక్షన్ వల్ల పాపకు ఆరోగ్యం సహకరించలేదని చెప్పేవారని అన్నారు బాదితులు.

సెప్టెంబర్ 13(ఈరోజు) సెర్లాక్ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే పురుగులు ఉన్నాయని.. దీంతో సంబంధిత అపోలో షాపులో వెళ్లి అడిగితే మొదట పొరపాటు జరిగిందని చెప్పి, తరువాత నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని అన్నారు. షాపుల మీద చర్యలు తీసుకుని పెట్ బషీరాబాద్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.