
- చిల్డ్రన్ హోమ్‌లో అగ్ని ప్రమాదం
- కాలిపోయిన సామాగ్రి.. పీర్జాదిగూడలో ఘటన
- చిన్నారులకు తప్పిన ముప్పు
మేడిపల్లి, వెలుగు : షార్ట్ సర్క్యూట్‌తో చిల్డ్రన్ హోమ్‌లో అగ్ని ప్రమాదం ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పీర్జాదిగూడ కార్పొరేషన్ మూడో డివిజన్ సాయి ఐశ్వర్య కాలనీ రోడ్ నం.6లో ఎ. మోహన్ అనే వ్యక్తి 6 నెలలుగా ‘అమ్మ ఒడి’ పేరుతో చిల్డ్రన్ హోమ్‌ను నడుపుతున్నాడు. ఈ హోమ్‌లో అనాథ పిల్లలకు ఉచిత వసతి, భోజనం అందిస్తున్నారు. పిల్లల కోసం దాతలు ఇచ్చిన యూనిఫాం, బుక్స్, షూస్, బియ్యం, ఇతర నిత్యావరాలను స్టోర్ రూమ్‌లో నిల్వ చేస్తున్నారు.
గురువారం ఉదయం స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. నిర్వాహకులు వెంటనే చిన్నారులను బయటికి పంపించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే స్టోర్ రూమ్ లోని సామాగ్రి కాలిపోయింది. దాతలు ఇచ్చిన పిల్లల కోసం ఇచ్చిన సామగ్రి కాలిపోయిందని.. ప్రభుత్వం ఆదుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.