నోయిడాలో బిల్డింగ్ పై నుంచి దూకి దంపతుల ఆత్మహత్య..! అసలేం జరిగింది..?

న్యూఢిల్లీ : నోయిడాలో భార్యభర్తలు బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ ఒకే బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.

నోయిడా సెక్టార్ 59లోని ఓ బిల్డింగ్ లో ఓ వ్యక్తి వాచ్ మెన్ గా చేస్తున్నాడు. గత ఎనిమిదేళ్ల నుంచి తన భార్యతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ఏమైందో తెలియదు.. కానీ.. ఉన్నట్టుండి వాచ్ మెన్, ఆయన భార్య బిల్డింగ్ 7వ అంతస్తు పై నుంచి శుక్రవారం (ఆగస్టు 4వ తేదీన) కిందకు దూకారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే వారిద్దరూ చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. 

ఆత్మహత్య చేసుకున్న దంపతుల నివాసం.. ఈశాన్య ఢిల్లీలోని చాంద్ బాగ్  ప్రాంతం. వీరి పిల్లలు ఇక్కడే బంధువులతో కలిసి ఉంటున్నారు. నోయిడాలో మాత్రం పిల్లలు ఉండరు. దంపతులు మాత్రమే నివసిస్తూ..భర్త వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. దంపతుల డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.