అల్వాల్: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వాల్ భూదేవి నగర్లో నివాసముండే ఘనే కీర్తికి (23) సాఫ్ట్వేర్ ఉద్యోగి సామ్రాట్తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆదివారం రాత్రి అత్తవారింట్లో కీర్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని అత్తింటి వారు చెబుతుండగా, పుట్టింటి వారు కీర్తి మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సోమవారం అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కూడా పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడింది. కర్నాటకలోని హసన్ జిల్లా సక్లేశ్‌పూర్‌కు చెందిన శోభిత(32) కన్నడలో పాపులర్ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించింది.పెండ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పిన శోభిత.. కొండాపూర్ శ్రీరాంనగర్‌లో తన భర్తతో కలిసి ఉంటోంది. హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో శోభితతో సుధీర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 2023 మే 21న వారు పెండ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్‌కు వచ్చి కొండాపూర్ శ్రీరాంనగర్‌లో ఉంటున్నారు. సుధీర్ రెడ్డి హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్చేస్తున్నాడు. ఇటీవల తెలుగు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో అవకాశాల కోసం శోభిత ప్రయత్నాలు చేస్తోంది.
Also Read : చేవెళ్ల ఆలూరు గేటు దగ్గర లారీ బీభత్సం
శనివారం రాత్రి 10 గంటల సమయంలో భర్తతో కలిసి భోజనం చేసిన శోభిత.. తన బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయింది. మరో బెడ్ రూంలో సుధీర్‌రెడ్డి తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అందులోనే నిద్రపోయాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పనిమనిషి వచ్చి శోభిత బెడ్ రూం డోర్కొట్టగా, ఆమె ఓపెన్ చేయలేదు. దీంతో సుధీర్ రెడ్డి డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, శోభిత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం.. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆత్మహత్య చేసుకునే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.