పిర్జాదిగూడలోని ఓ మల్డీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు గురువారం కొందరు ఆందోళనకు దిగారు. వైద్యం వికటించి అజయ్ అనే వ్యక్తి మరణించిన సంఘటన పిర్జాదిగూడ జేపీ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. అజయ్ మూడు రోజుల క్రితం బాత్రూంలో జారి పడి జెపి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేర్పించారు. హాస్పిటల్ వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని వెంటనే సర్జరీ చేయాలని చెప్పి బ్రెయిన్ సర్జరీ చేశారు. మరుసటి రోజు స్కానింగ్ చేయాలని మరొక హాస్పిటల్ తీసుకువెళ్లగా మార్గమధ్యంలో అజయ్ చనిపోయాడు. దీంతో జేపీ హాస్పిటల్ వద్ద అజయ్ బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ లో సరియైన వైద్యం అందించకపోవడంతో చనిపోయాడని అజయ్ బంధువులు ఆందోళనకు చేస్తున్నారు.
యాజమాన్యం అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయు జెఎసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. దీనిపైన డీఎంహెచ్ఓ కు మరియు తెలంగాణ వైద్యశాఖ మంత్రికి ఆస్పటల్ పైన ఫిర్యాదు చేనున్నట్లు తెలిపారు. గత 15 రోజుల కిందట కూడా ఒక అమ్మాయి వైద్యం వికటించి చనిపోయిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. జేపీహాస్పిటల్ పైన వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.