భద్రాచలం,వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం హుండీ ని లెక్కించారు. జూన్ 12న నుంచి సోమవారం వరకు రూ.1కోటి 21లక్షల 44వేల 579లు నగదు వచ్చింది. 104 గ్రాముల బంగారం, 805 గ్రాముల వెండి హుండీల్లో వచ్చాయి. 183 అమెరికా డాలర్లు, 1000 మయన్మార్ క్యాట్స్, 3 ఖతార్ రియాన్స్, 50 కెనడా డాలర్స్, 10 నేపాల్ రూపీస్ ఫారన్ కరెన్సీ వచ్చినట్లు ఈఓ రమాదేవి వెల్లడించారు. సీసీ కెమెరాల నిఘాలో హుండీలనె తెరిచి లెక్కించారు. కాగా భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.