జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆదాయం రూ.1,454 కోట్లు

జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆదాయం రూ.1,454 కోట్లు

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వింగ్ ఆదాయం 2021–22తో పోల్చితే 2022–23లో పెరిగింది. 2021–22లో నిర్మాణాల అనుమతుల ద్వారా రూ.1,144.08 కోట్లు రాగా, 2022–23లో రూ.1,454.76 కోట్లు వచ్చినట్లు బల్దియా అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏడాదిలో మొత్తం 16,329 పర్మిషన్లు ఇవ్వగా, ఇందులో 13,771 భవన నిర్మాణాలు, 23 లేఅవుట్లు, 2,581 ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి. భవనాల్లో 40 అంతస్తులకు మించినవి నాలుగు, 10 నుంచి 40 ఫ్లోర్లలోపు 
53 భవనాలు ఉన్నాయి.