
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం (సెప్టెంబర్ 9న) తెలిపింది.
శని, ఆదివారాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో మాత్రం ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.
తూర్పు భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. పశ్చిమబెంగాల్, బీహార్ లోనూ మోస్తారుగా వర్షాలు పడుతాయంటున్నారు.
ALSO READ :ఉత్తరాఖండ్ వరద బాధితులకు రిలయన్స్ రూ.25 కోట్లు సాయం
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని..అటు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాయువ్య భారతదేశంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల చెదురుమదురు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.