- ఉ 9.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్
వడోదర : వెస్టిండీస్ అమ్మాయిల జట్టుపై ఫైనల్ పంచ్ ఇచ్చేందుకు ఇండియా విమెన్స్ టీమ్ సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న హర్మన్‌సేన శుక్రవారం జరిగే మూడో, చివరి వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 300 ప్లస్ స్కోర్లతో దుమ్మురేపిన ఇండియా ఆఖరాటలో మరింతగా విజృంభించాలని చూస్తోంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఫుల్ ఫామ్‌లో ఉండగా.. కొత్త ఓపెనర్ ప్రతిక గత రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆకట్టుకుంది.
హర్లీన్ డియోల్ కూడా సెంచరీతో టచ్‌లోకి రావడంతో ఇండియా బ్యాటింగ్ బలం రెట్టింపైంది. బౌలింగ్‌లోనూ ఆతిథ్య జట్టుకు తిరుగులేదు. మరోవైపు టీ20లతో పాటు వన్డే సిరీస్ కోల్పోయిన విండీస్ ఆఖరాటలో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో కెప్టెన్ హేలీ మాథ్యూస్ సెంచరీతో ఫామ్‌లోకి రాగా.. మిగతా ప్లేయర్లు కూడా సత్తా చాటితేనే విండీస్ విజయంతో ఇండియా టూర్‌ను ముగించగలదు.