వాయుసేన​లోకి మరో 12 సుఖోయ్​లు.. కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం

  • వాయుసేన​లోకి మరో 12 సుఖోయ్​లు
  • కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం

న్యూఢిల్లీ :  బార్డర్​లో పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం తన బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా రూ.11 వేల కోట్ల వ్యయంతో 12 సుఖోయ్ -30 ఎంకేఐలను విమానాల కొనుగోలకు రక్షణ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. వీటిని భారత్​లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్) తయారు చేయనుంది.

ALSO READ: మట్టి గణపతులను పూజించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

విమానం అవసరాలకు అనుగుణంగా 60 శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్​ను కలిగి ఉంటుంది. ఇవి బహుళ భారతీయ ఆయుధాలు, సెన్సార్లతో కూడిన అత్యంత ఆధునిక సుఖోయ్ ఎస్​యు-30 ఎంకేఐ విమానాలని రక్షణ అధికారులు తెలిపారు.