1.31 లక్షల మందికి తాత్కాలిక జాబ్స్ : ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్

హైదరాబాద్​, వెలుగు :  తమ మెంబర్ ​కంపెనీలు 12 నెలల్లో ఫార్మల్ ​సెక్టార్​కు 1.31 లక్షల ఫ్లెక్సీ జాబ్స్​ను (కాంట్రాక్ట్, టెంపరరీ) అందించాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్​) వెల్లడించింది. ఇవి జనరల్ స్టాఫింగ్,  ఐటీ స్టాఫింగ్​లో ఎక్కువగా ఉన్నాయి. జులై 2022–- జూన్ 2023 మధ్య కాలంలో ఈ జాబ్స్​ వచ్చాయి. ఫ్లెక్సీ స్టాఫింగ్​ పరిశ్రమ సంవత్సరానికి 12.5 శాతం వృద్ధి చెందింది. 2023 జనవరి–-మార్చి 2023తో పోల్చితే ఇది ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ లో 5.6శాతం వృద్ధిని సాధించింది. దీనిని బట్టి చూస్తే ఫ్లెక్సీ (కాంట్రాక్ట్) వర్క్‌‌ఫోర్స్‌‌కు బలమైన డిమాండ్‌‌ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.

ALSO READ: హైదరాబాద్‌‌లో మిల్లెట్స్ కాన్‌‌క్లేవ్‌‌

ముఖ్యంగా ఈ–కామర్స్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌‌కేర్, ఎఫ్‌‌ఎంసీజీ, ఎనర్జీ, రిటైల్  బ్యాంకింగ్ వంటి కీలక రంగాలలో కాంట్రాక్టు ఉద్యోగాలకు డిమాండ్​ పెరిగింది. ఈ ఏడాది జూన్  నాటికి ఫార్మల్​ ఫ్లెక్సీ వర్క్‌‌ఫోర్స్ 1.5 మిలియన్లకు చేరుకుందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఈడీ సుచితా దత్తా  అన్నారు.  ఫ్లెక్సీ వర్క్‌‌ఫోర్స్ మార్కెట్లలో తెలంగాణ టాప్​–5లో ఉందని చెప్పారు.  ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్.. ఇది ఫార్మల్ స్టాఫింగ్, ఫెసిలిటీ మేనేజ్‌‌మెంట్,  సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.