
న్యూఢిల్లీ: ఈ వారం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల డైరెక్షన్‌ను గ్లోబల్ అంశాలు ప్రభావితం చేయనున్నాయి. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ల (ఎఫ్‌పీఐల) కదలికలు, కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్, డాలర్–రూపాయి ట్రెండ్, క్రూడాయిల్ ధరలపై ట్రేడర్లు దృష్టి పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో షేర్లను అమ్మేస్తుండడం, కంపెనీల క్వార్టర్లీ ఫలితాలు అంచనాలను అందుకోకపోవడం, గ్లోబల్‌గా టారిఫ్ వార్ మొదలవ్వడంతో కిందటి వారంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పడ్డాయి.
రిజల్ట్స్ సీజన్ ముగుస్తుండడంతో గ్లోబల్ అంశాల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారని, ట్రంప్ ట్రేడ్ పాలసీలతో అనిశ్చితి నెలకొందని మోతీలాల్ ఓస్వాల్ ఎనలిస్ట్ సిద్ధార్ధ ఖేమ్కా పేర్కొన్నారు. యూఎస్ టారిఫ్‌ల ప్రభావం ఎంత మేర ఉంటుందోనని ఇన్వెస్టర్లు లెక్కలేస్తున్నారని అన్నారు. ఈ వారం ఫెడ్ మీటింగ్ మినిట్స్ వెలువడనున్నాయి. కాగా, కిందటి వారం సెన్సెక్స్ 2,644 పాయింట్లు , నిఫ్టీ 810 పాయింట్లు (3.41 శాతం) పడ్డాయి.