భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. ఒక్క రోజే రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. ఒక్క రోజే  రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి

 భారత స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగవ రోజు కుప్పకూలింది. గడిచిన మూడు రోజులుగా నష్టాలను చవిచూస్తో్న్న ఈక్విటీ మార్కెట్ సూచీలు సెన్సెక్, నిఫ్టీ.. 2024, అక్టోబర్ 25న కూడా భారీగా పతనమయ్యాయి. 662పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 79,402 దగ్గర ముగియగా.. 218 పాయింట్లు కోల్పోయి 24,180 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయ్యింది. 

మార్కెట్ సూచీల భారీ పతనంతో శుక్రవారం ఒక్క రోజే  రూ.7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి అయ్యింది. మార్కెట్ ప్రారంభం నుంచే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ఏ దశలోనూ సూచీలు లాభాల దిశగా పయణించలేదు. గంట గంటకు నష్టాలు పెరగడంతో మార్కెట్ కోజ్లింగ్ సమయానికి రూ.7 లక్షల కోట్ల సంపద హూష్‎కాకి అయ్యింది. 

బలహీన త్రైమాసిక ఫలితాలు, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడమే స్టాక్ మార్కెట్ వరుస పతనానికి కారణమని మార్కెట్ ఎక్స్‎పర్ట్స్ అంచనా వేస్తున్నారు.  ఐటీసీ, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందూస్థాన్ యూనిలివర్‌, హెచ్‌సీఎల్ టెక్‌, సన్‌ఫార్మా, కోటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడగా.. ఎన్‌టీపీసీ,  టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఎం అండ్ ఎం, ఎల్‌ అండ్ టీ, మారుతి సుజుకి, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ నష్టాలను చవిచూశాయి. సెక్టార్ల పరంగా చూసుకుంటే.. ఒక్క ఎఫ్‌ఎంసీజీ (0.5 శాతం పెరిగింది) లాభాలు నమోదు చెయ్యగా.. మిగిలిన అన్ని సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్&గ్యాస్, పవర్, టెలికాం, మీడియా 1-2 శాతం క్షీణించాయి.