అమ్మాయిలకు పరీక్ష..నేడు ఆసీస్‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌తో తొలి వన్డే

అమ్మాయిలకు పరీక్ష..నేడు ఆసీస్‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌తో తొలి వన్డే
  • ఉ. 8.50 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌

బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌ : ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. గురువారం జరిగే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఉన్న నేపథ్యంలో జట్టులో ఉన్న లోపాలను ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ ద్వారా సవరించుకోవాలని భావిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌పై 2–1తో సిరీస్‌‌‌‌‌‌‌‌ నెగ్గినా.. టీమిండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌ అనుకున్న స్థాయిలో రాణించలేదు. 

దాని ఫలితమే ఓపెనర్‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మను ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించారు. దీంతో ఆమె ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొత్త కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ను ట్రై చేయాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నిస్తోంది. వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ను ఓడించడమంటే ఏ జట్టుకైనా కత్తిమీద సామే. ఇప్పటి వరకు ఆడిన 16 వన్డేల్లో ఇండియా కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. సొంతగడ్డపై సిరీస్‌‌లో ఆసీస్‌‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది.