హైదరాబాద్ ఇక్ఫాయ్ యూనివర్సిటీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన మీద విచారణ కొనసాగుతోంది. నిన్న స్టూడెంట్ పై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఐతే ఇక్ఫాయ్ లో జరిగిన ఘటనపై సందిగ్దత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. వాష్ రూంలో ఏం జరిగిందనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.
అసలు ఘటన ఎలా జరిగిందో వర్సిటీ అధికారులు తేల్చుకోలేక పోతున్నారు. వేడినీళ్ల కారణంగానే ఘటన జరిగిందా... లేదా యాసిడ్ ఎటాక్ పై క్లారిటీ ఇవ్వడం లేదు అధికారులు. లేఖ్య వర్ధిని ఘటనపై కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు యూనివర్సిటీ అధికారులు. ప్రస్తుతం కొత్తపేట ఓమ్ని హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది బాధిత విద్యార్థిని. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో ఘటన జరిగింది. రంగునీళ్లకు బదులు యాసిడ్ ను బకెట్లో నింపారు స్టూడెంట్స్. కలర్ వాటర్ అనుకుని లేఖపై యాసిడ్ పోశారు తోటి విద్యార్థులు. దీంతో విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు స్టూడెంట్స్.
అయితే యాసిడ్ దాడి కాదు బకెట్లో వేడి నీళ్ల వల్లే విద్యార్థినికి గాయాలైనట్లు వర్శిటీ యాజమాన్యం చెబుతోంది.