మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 21న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ విద్యార్థులను సార్ అని గౌరవించాలని జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు కొందరు సీనియర్లు. ర్యాగింగ్ ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కమిటీ విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ మధ్యే వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ కలకలం రేపింది. కేఎంసీలో ర్యాగింగ్ ఘటనపై కాలేజీ, పోలీస్ అధికారులు, పేరెంట్స్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కూడిన 15 మంది సభ్యులతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీన వసతి గృహంలో ర్యాగింగ్ జరిగిందని కమిటీ నిర్ధారించింది. జూనియర్ విద్యార్ధిపై ర్యాగింగ్ కి పాల్పడిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్, దాడి చేసిన ఏడుగురు విద్యార్థులను మూడు నెలల పాటు కాలేజీ నుంచి, ఒక ఏడాది పాటు హాస్టల్ వసతి నుంచి సస్పెండ్ చేశారు. ఇదే కేసులో మరో 20 మంది విద్యార్థులకు నోటీసులు జారీ చేశారు.