శ్మశానవాటిక స్థల సమస్యను పరిష్కరించాలి

శ్మశానవాటిక స్థల సమస్యను పరిష్కరించాలి

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ మండలం చేపూర్​ గ్రామంలోని శ్మశాన వాటిక స్థల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని శుక్రవారం ఆర్మూర్​ ఆర్డీవో రాజాగౌడ్​ ను కలిసి మెమోరాండం అందజేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ.. 25 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన జంబి పూజ స్థలం, శ్మశాన వాటిక స్థలాన్ని  సారంగి  పెద్ద సాందన్న, సారంగి విజయ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు.

గ్రామానికి చెందిన భూమి ఎందుకు  కబ్జా చేశారని అడిగితే వీడీసీ పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారన్నారు.  అక్రమ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి జంబి పూజ, శ్మశాన వాటిక స్థలాలు గ్రామానికి దక్కేలా చూడాలని కోరారు.  కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇందూర్ సాయన్న, మాజీ ఎంపీటీసీ జన్నేపల్లి గంగాధర్, వీడీసీ అధ్యక్షుడు మేడిపల్లి  శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.