- టీయూడబ్ల్యూజే నేత నగునూరి శేఖర్
ఆసిఫాబాద్, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తారని టీయూడబ్ల్యూజే నేత నగునూరి శేఖర్ చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ విలేకరుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
జర్నలిస్టులపై దాడి సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ అన్నారు. శుక్రవారం టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కు వినతి పత్రం అందజేశారు.