కర్ణాటక నుంచి తెలంగాణకు ఓ ఏనుగు.. ఎందుకంటే?

కర్ణాటక అటవీ శాఖ రూపవతి అనే భారీ ఏనుగుని తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. తెలంగాణ రాష్ట్రం అటవిశాఖ మంత్రి కొండా సురేఖ ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి.. రూపవతిని రాష్ట్రంలోని రెండు పండగల సందర్భంలో తెప్పించారు. ముహర్రం బీబీకా ఆలం, బోనాల ఊరేగింపుల కోసం ఏనుగు(రూపవతి)ని తాత్కాలికంగా మన రాష్ట్రానికి తీసుకువచ్చారు. పండగల అనంతరం మల్లీ కర్ణాటక అటవిశాఖకు ఆ ఏనుగును అప్పగించారు.

ALSO READ | ఎంత నిజాయితీ:పేద కూలీలకు దొరికిన బంగారం నిధి..అధికారులకు అప్పగింత