ప్రతి భారతీయుడు ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ది కశ్మీర్ ఫైల్స్ అన్నారు ఎంపీ సోయం బాపూరావు.సగటు భారతీయుడు తీసిన సినిమా యావత్ ప్రపంచాన్ని కదిలించిందన్నారు.ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్లే జమ్ము కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అయ్యిందన్నారు. ఏ ప్రధాని తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని నరేంద్రమోడీ తీసుకున్నారన్నారు. థియేటర్లలో నినాదాలు చేసిన వారిని పట్టుకొని దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో కూడా దేశంపై విషం కక్కేవారు ఉన్నారంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. ఆదిలాబాద్ మరో భైంసా కాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం
రష్యాతో పోరుకు సై అంటున్న 98 ఏండ్ల మహిళ
త్యాగాలతో వచ్చిన తెలంగాణను నేనే తెచ్చానంటాడు