ది కేరళ స్టోరీ(The Kerala Story).. ఇదొక సంచలన సినిమా. కేరళ రాష్ట్రంలో కనిపించకుండా పోయిన దాదాపు 300 వందల మంది అమ్మాయిల నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాను సుదీప్తో సేన్(Sudipto Sen) తెరకెక్కించారు. అలా మిస్సైన యువతులను బలవంతంగా మతం మార్చి ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారని కాన్సెప్ట్ తో ఈ సినిమా రావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ సినిమాలో చూపించినట్టుగా ఏమీ జరుగలేదని, మతవిద్వేషాలు రేకెత్తించేలా సినిమా ఉందని, సినిమాను బ్యాన్ చేయాలని కూడా కోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి.
అయితే ఇన్ని అడ్డంకుల మధ్య, వివాదాల మధ్య థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సంచలన విజయం సాధించింది. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గతేడాది మేలో రిలీజవగా .. ఓటీటీకి మాత్రం రాలేదు. ఆప్పటినుండి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు.
Also read : Sujeeth with OG: ఓజీతో సుజీత్.. పూనకాలు తెప్పిస్తున్న డైరెక్టర్ ప్రొఫైల్ పిక్
తాజాగా వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేస్తూ.. ఫిబ్రవరి 16న ది కేరళ స్టోరీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. మరి థియేటర్స్ లో చూడటం మిస్సైన వారు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి.