హైదరాబాద్ : మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక నిందితులు మంగళవారం (సెప్టెంబర్ 26న) పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. డ్రగ్స్ కేసులో కలాహర్ రెడ్డి, హిటాచి సాయి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే ఈ ముగ్గురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల ఎదుట లొంగిపోమ్మని కోర్టు ఆదేశించింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A13 గా కలహర్ రెడ్డి, A18 గా సూర్య, A22 గా హిటాచి సాయి ఉన్నారు. డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దర్యాప్తు ముమ్మరం మరింత ముమ్మరం చేశారు.
సినీ ఇండస్ట్రీలో స్క్రిప్ట్, రైటర్, షల్ వి మీట్ .. అనే కోడ్ లాంగ్వేజ్ తో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంత మంది డ్రగ్స్ కన్జ్యూమర్స్ కు నోటీసులు జారీ చేశారు. హీరో నవదీప్ ను ఆరు గంటల పాటు విచారించారు. నవదీప్ 40 మంది డ్రగ్ కన్జూమర్స్ పేర్లను చెప్పినట్లు సమాచారం.