పీస్ కమిటీలదే కీ రోల్‌.. సిటీలో మత సామరస్యాన్ని కాపాడాలి: ​సీపీ సీవీ ఆనంద్

పీస్ కమిటీలదే కీ రోల్‌.. సిటీలో మత సామరస్యాన్ని కాపాడాలి: ​సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్‌, వెలుగు: సిటీలో లా అండ్​ఆర్డర్‌‎ను కాపాడడంలో, మతసామరస్యాన్ని పెంపొందించడంలో  పీస్‌ కమిటీలు అత్యంత కీలకంగా వ్యవహరించాలని సీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. స్థానిక పోలీసుల సహకారంతో సెంట్రల్‌ పీస్ అండ్‌ వెల్ఫేర్ కమిటీ సభ్యులు శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. ముత్యాలమ్మ టెంపుల్‌ ఘటన నేపథ్యంలో సెంట్రల్ పీస్‌ అండ్ వెల్ఫేర్‌‌ కమిటీ మెంబర్స్‌తో సీపీ శుక్రవారం భేటీ అయ్యారు. 

దాదాపు 350 మందితో బంజారాహిల్స్ కమాండ్‌ అండ్ కంట్రోల్‌ సెంటర్‌‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పీస్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ముత్యాలమ్మ టెంపుల్‎పై దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మత సామరస్యం పెంచేందుకు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.