ఆర్ఎఫ్ సీఎల్లో హాస్పిటల్ కట్టని యాజమాన్యం
ప్రమాదం జరిగిన ప్రతిసారి వేరే చోటికి పరుగులు
2 నెలల కింద గ్యాస్‌లీకై ముగ్గురు కార్మికులకు అస్వస్థత
బొగ్గుతో నడిచేటప్పుడు 27 బెడ్లతో హాస్పిటల్
గ్యాస్ఆధారితంగా మారాక పట్టించుకోని అధికారులు
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లో సివిల్ డిపార్ట్ మెంట్‌లోని డిప్యూటీ మేనేజర్ ఒకరు ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయన్ని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ అడ్మిట్చేయగా కోలుకుని తిరిగి ఇంటికి వచ్చారు. కొద్దిరోజుల్లోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఏమయ్యిందో తెలుసుకునేందుకు కనీసం టౌన్‌షిప్‌లో డిస్పెన్సరీ సౌకర్యం కూడా లేదు. మరోసారి కరీంనగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. సరైన వైద్యం అందకనే ఆఫీసర్ చనిపోయాడని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని ఆఫీసర్లు, ఎంప్లాయ్స్ ఆందోళన చేశారు.’’
గోదావరిఖని, వెలుగు: ఆర్‌ఎఫ్‌సీఎల్(రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) ప్లాంట్ యాజమాన్యం టౌన్‌షిప్‌లో హాస్పిటల్ నిర్మించకపోవడంతో ఇక్కడ పనిచేసే ఆఫీసర్లు, ఎంప్లాయ్స్, ఎంప్లాయ్స్ కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొగ్గు ఆధారితంగా నడిచేటప్పుడు 27 బెడ్లతో హాస్పిటల్ఉండేది. గ్యాస్ఆధారితంగా మొదలయ్యాక యాజమాన్యం పట్టించుకోలేదు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ఎంప్లాయ్స్‌కు ఏమైనా అయితే గోదావరిఖని, కరీంనగర్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఫ్యాక్టరీల చట్టం ప్రకారం దవాఖాన నిర్మించాలని మేనేజ్మెంట్గాలికొదిలేసింది. కనీసం 20 బెడ్ల హాస్పిటల్ నిర్మించాలని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి.
రూల్స్పాటిస్తలే
బొగ్గుతో నడిచే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని(ఎఫ్‌సీఐ) నష్టాల కారణంగా 1999లో మూసివేశారు. కొత్త టెక్నాలజీతో గ్యాస్ ఆధారితంగా అదే ప్లేస్‌లో రూ. 6,175కోట్ల పెట్టుబడితో ఆర్‌ఎఫ్‌సీఎల్ నిర్మించారు. ఇందులో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్‌ఎఫ్‌ఎల్), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్), ఎఫ్‌సీఐఎల్, అల్దర్ టాప్స్ తదితర పెద్ద కంపెనీలతోపాటు తెలంగాణ గవర్నమెంట్‌కు ఇందులో వాటా ఉంది. 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియాను ఏటా ఉత్పత్తి చేయాలని యాజమాన్యం టార్గెట్పెట్టుకుంది. కాగా కంపెనీలో ప్రస్తుతం 400 మంది ఆఫీసర్లు, ఎంప్లాయ్స్, వెయ్యి మందికి పైగా పర్మినెంట్, కాంట్రాక్టు లేబర్వివిధ లొకేషన్లలో పనిచేస్తున్నారు. వీరందరికి వైద్య పరంగా ఏదైనా ఆపద వస్తే ప్లాంట్‌లో ఫస్ట్ ఎయిడ్తప్ప మెరుగైన చికిత్స అందించే పరిస్థితి లేదు. ప్లాంట్‌కు సమీపంలో ఆఫీసర్లు, ఎంప్లాయ్స్కోసం టౌన్ షిప్ నిర్మించిన యాజమాన్యం.. హాస్పిటల్కట్టించలేదు. ప్రమాదం జరిగిన ప్రతిసారి గోదావరిఖని, కరీంనగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తీసుకెళ్తున్నారు. ఫ్యాక్టరీల రూల్స్ ప్రకారం 500 మందికి పైగా ఉద్యోగులు ఉంటే వారి కోసం హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ మేనేజ్‌మెంట్ దాన్ని పట్టించుకోవట్లేదు.
20 బెడ్లతో వెంటనే నిర్మించాలే
రామగుండంలోని ప్లాంట్‌ను తెలంగాణ తోపాటు దక్షిణాది రాష్ట్రాలకు యూరియా సప్లై చేసేందుకు నిర్మించారు. ఇది పెద్ద ప్లాంట్కావడంతో డైలీ చిన్నచిన్న ప్రమా దాలు జరుగుతుంటాయి. గ్యాస్ లీకైన ఘటనలు ఉన్నాయి. ప్రమాద సమ యంలో బాధితులకు వైద్యం అందించేం దుకు టౌన్‌షిప్‌లో హాస్పిటల్అవసరం. 20 బెడ్లతో వెంటనే హాస్పిటల్‌ను ప్రారంభిం చాలి. లేకపోతే ఆందోళనలు చేస్తాం. - ఎ.రాంకిషన్, ఆర్‌ఎఫ్‌సీఎల్ జేఏసీ అడ్వైజర్
అప్పడు బాగానే ఉండేది
బొగ్గుతో నడిచేటప్పుడు ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో 27 బెడ్లతో అప్పటి యాజమాన్యం హాస్పిటల్ ఏర్పాటు చేసింది.10 బెడ్లతో ఫీమేల్ వార్డు, 10 బెడ్లతో మేల్ వార్డు, డెలీవరీల కోసం 5 బెడ్లు, ఎమర్జెన్సీ కోసం 2 బెడ్లు ఉండేవి. 20 మంది డాక్టర్లు, 20 మంది స్టాప్, 30 మంది సపోర్టింగ్ స్టాప్ పనిచేసేవారు. రెండు ఆపరేషన్ థియేటర్లు, మూడు అంబులెన్స్‌లు, ఇతర సౌకర్యాలతో హాస్పిటల్ కొనసాగింది. ప్రస్తుత మేనేజ్మెంట్ఆ బిల్డింగ్‌ను కూల్చేసింది.