అధికారిక లాంఛనాలతో టాటా అంత్యక్రియలు..

అధికారిక లాంఛనాలతో టాటా అంత్యక్రియలు..

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలను పభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు మహారాష్ట్ర సీఎం షిండే. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. రతన్‌ టాటా మరణం పట్ల మహారాష్ట్ర సీఎం షిండే సంతాపం వ్యక్తం చేసిన షిండే... టాటా లేరనే వార్త చాలా బాధాకరమని,చాలా మంది ప్రజలు రతన్‌టాటా నుంచి ప్రేరణ పొందారని, రతన్‌టాటా మన దేశానికి కోహినూర్ అని అన్నారు. 

రతన్ టాటా అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో బుధవారం ( అక్టోబర్ 10, 2024 ) తుదిశ్వాస విడిచారు రతన్ టాటా. వ్యాపారవేత్తగానే కాకుండా.. దేశమే ముఖ్యమని నమ్మిన గొప్ప మానవతావాదిగా.. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా రతన్ టాటా ఎందరికో ఆదర్శం.

86 ఏండ్ల రతన్ టాటాకు ఇటీవల బీపీ సడెన్​గా పడిపోవడంతో హాస్పిటల్​కు తరలించారు. బుధవారం ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగించారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారని టాటా గ్రూప్ ప్రకటించింది.

 

రతన్ టాటా ఆరోగ్యంపై ఇటీవల ఆందోళనలు వ్యక్తమవడంతో తాను బాగానే ఉన్నానని ఆయన ప్రకటన చేశారు. రొటీన్ మెడికల్ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరానని తెలిపారు. కానీ బుధవారం ఆయనను ఐసీయూకు షిఫ్ట్ చేశారన్న వార్తలు రావడంతోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. అయితే, టాటా గ్రూప్ అధికారిక ప్రకటనకు ముందే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంక ఈ విషయాన్ని కన్ఫమ్ చేస్తూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ట్వీట్ చేశారు.