వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్ లో భాగంగా టీమిండియా టాప్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకుంది. కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ పై విజయంతో టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. మొత్తం 11 మ్యాచ్ ల్లో 8 విజయాలు.. రెండు ఓటములు.. ఒక డ్రా తో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్ విజయాలు శాతం 74.24 గా ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ (2023-25) ఫైనల్ కు ముందు మరో 8 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో న్యూజిలాండ్ స్వదేశంలో మూడు టెస్టులతో పాటు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసీస్ గడ్డపై ఆడాల్సి ఉంది.
మొత్తం 8 టెస్టుల్లో 4 మ్యాచ్ లు గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా ఫైనల్ కు చేరవచ్చు. టాప్ 2 లో భారత్ నిలవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో పాటు కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా (62.50 ) ఉంది. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ భారత్, ఆసీస్ ఆడడం ఖాయమన్న దశలో శ్రీలంక ఈ రేస్ లోకి దూసుకొస్తోంది.
Also Read :- ఇంగ్లాండ్‌ను మించిన విధ్వంసం
లంక తమ సొంతగడ్డపై న్యూజిలాండ్ పై 2-0 తేడాతో ఘన విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచింది. తొలి టెస్ట్ గెలిచి మూడో స్థానంలో నిలిచిన లంక తమ విజయాల శాతాన్ని 55. 56 శాతానికి పెంచుకుంది. దీంతో శ్రీలంక పాయింట్స్ టేబుల్ లో ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉంది. దీంతో తొలి రెండు స్థానాల్లో ఎవరు నిలుస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియాలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు దక్షిణాఫ్రికాలో శ్రీలంక టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్ లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లే జట్లను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.