ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి

ఆసిఫాబాద్, వెలుగు : పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేసి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని ఆఫీస్ లో పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి వేముల వైష్ణవి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల కాలంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాసి, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా విద్యారంగాన్ని పాత సమస్యలే వెంటాడుతున్నాయన్నారు. విద్యారంగానికి సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్​చేశారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టింగ్ భర్తీ చేయాలన్నారు.