వాళ్లను ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం : మల్లికార్జున ఖర్గే

వాళ్లను ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం : మల్లికార్జున  ఖర్గే

లోక్ సభ ఎన్నికలు 2024 ఫలితాలు వెల్లడైన తర్వాత ఇండియా కూటమి నేతలు బుధవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. దాదాపు గంటసేపు కూటమి ముఖ్యనాయకుల మధ్య చర్చలు జరిగి సాయంత్రం సమావేశం ముగింసింది. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నామని  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. బీజేపీ పార్టీ నైతికంగా ఓటమిపాలైందని ఖర్గే భేటీలో అన్నారు. 

మోదీ రాజకీయంగా, వ్యక్తిగతంగా నష్టపోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు ప్రాంతీయ పార్టీ నాయకులు డీఎంకే స్టాలిన్, సీతారం ఏచూరి, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, శివనేన, కేసీ వేణుగోపాల్, తేజస్వీ యాదవ్, ఒమర్ అబ్ధుల్లా నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అటు ఎన్డీయే కూటమి నేతల భేటీ కూడా ఈరోజే జరిగింది. కేంద్ర రాజకీయాల్లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారా అని ఆసక్తి నెలకొంది.