పొంగులేటి కాంగ్రెస్ లోకి వచ్చేలా రేణుకా చౌదరి చొరవచూపాలె : కాంగ్రెస్ లీడర్లు

రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఇంట్లో కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షట్కర్, ఇతర నేతలు హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై నేతలు చర్చించారు. ఈ మధ్యే బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ వేటు వేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపైనా కాంగ్రెస్ నాయకులు చర్చించారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలా రేణుకాచౌదరి చొరవ చూపాలని పార్టీ నాయకులు కోరారు. 

ముఖ్యంగా నిరుద్యోగ దీక్షల సక్సెస్ పై కాంగ్రెస్ లీడర్లు  ఫోకస్ పెట్టారు. తమకు చెప్పకుండా ఏప్రిల్ 21న నల్గొండలో నిరుద్యోగ దీక్ష పెట్టారంటూ జిల్లా నేతల ఫిర్యాదు చేశారు. దీంతో ఏప్రిల్ 21న నల్గొండలో జరగాల్సిన నిరుద్యోగ దీక్ష 28వ తేదీకి వాయిదా పడింది.