Paris olympics: అమెరికా లెజెండరీ స్విమ్మర్ కేటీ లెడెకి 9 స్వర్ణాలు

Paris olympics: అమెరికా లెజెండరీ స్విమ్మర్ కేటీ లెడెకి  9 స్వర్ణాలు

నాంట్రెరే (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): అమెరికా లెజెండరీ స్విమ్మర్ కేటీ లెడెకి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన బంగారు పతకాల సంఖ్యను తొమ్మిదికి పెంచుకుంది. దాంతో విశ్వక్రీడల్లో అత్యధిక స్వర్ణాలు గెలిచిన మహిళగా  సోవియెట్ మాజీ అర్టిస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిమ్నాస్ట్ లారిసా లాటినినా రికార్డును సమం చేసింది. కేటీ 15 ఏండ్ల వయసులో లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాను తొలి స్వర్ణం గెలిచిన తేదీనే (ఆగస్టు 3) ఈ ఘనత సాధించడం విశేషం. 

శనివారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్ ఫైనల్లో  లెడెకి.. టర్మినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేరొందిన  ఆస్ట్రేలియా స్విమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరియార్నె టిట్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడిస్తూ  8 నిమిషాల11.04 సెకండ్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టాప్ ప్లేస్ సాధించింది. టిట్మస్ 8 నిమిషాల 12.29 సెకండ్లతో రజతం నెగ్గగా, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏకే చెందిన పెయిగ్ మడెన్ (8:13.00సె) కాంస్యం గెలిచింది. కాగా, ఈ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే 1500 మీ. ఫ్రీస్టయిల్లో గోల్డ్ గెలిచిన లెడెకి.. 400 మీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంస్యం, 4 x200 మీ. రిలేలో రజతం అందుకుంది.